Nirmal: నిర్మల్ పోలీసుల 'సూపర్' ఐడియా.. ఇక తెలంగాణ అంతటా 'పోలీస్ అక్క'లే!

Nirmal: నిర్మల్ జిల్లాలో మహిళా భద్రత కోసం ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించిన పోలీస్ అక్క, శివంగి టీం బృందాలను డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 14 April 2026 10:33 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ పోలీసుల 'సూపర్' ఐడియా.. ఇక తెలంగాణ అంతటా 'పోలీస్ అక్క'లే!

Nirmal: నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీస్ అక్క, శివంగి టీం లాంటి బృందాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని డిజిపి శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నిర్మల్లోని డీఎస్పీ కార్యాలయంలో నిర్మించిన కమిటీ హాల్లో పోలీసు అక్కలతో డిజిపి మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిజిపి శివధర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అక్కలతో ముచ్చటించి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోలీసు అక్కలు, శివంగి టీంలు చేస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సేవకై పోలీసు శాఖ ఎల్లప్పుడు ముందుంటుందని తెలిపారు. పోలీసు అక్క శివంగి టీం లను ఏర్పాటు చేసి మహిళా భద్రతకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బ్లూ కోర్టు సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్ల పెల్లిలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు సాయి కిరణ్, రాజేష్ మీనా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story