Peddapalli: ధర్మారం పోలీసుల మెరుపు వేగం: గంటలోనే ఫోన్ రికవరీ!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎస్ఐ ఎం. ప్రవీణ్ కుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, బైక్ పై వెళ్తుండగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న డాక్టర్ స్పందనకు కేవలం గంట వ్యవధిలోనే దానిని అప్పగించి పోలీస్ శాఖ ప్రతిష్టను చాటారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 March 2026 10:34 AM IST
Peddapalli
X

Peddapalli: ధర్మారం పోలీసుల మెరుపు వేగం: గంటలోనే ఫోన్ రికవరీ!

ధర్మారం (పెద్దపల్లి జిల్లా): బాధితులు ఆపదలో ఉన్నప్పుడు పోలీసులు స్పందించే తీరు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పోలీసులు తమ కర్తవ్య దీక్షను చాటుకున్నారు. గంట వ్యవధిలోనే పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్‌ను రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు.

ధర్మారం మండల కేంద్రానికి చెందిన వైద్యురాలు స్పందన ఈరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో ధర్మారం - ఎండపల్లి బైపాస్ రోడ్డుపై బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆమె సెల్ ఫోన్ జారి కింద పడిపోయింది. ఫోన్ పోవడంతో ఆందోళన చెందిన ఆమె వెంటనే ధర్మారం ఎస్ఐ ఎం. ప్రవీణ్ కుమార్ ను సంప్రదించారు.

బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బంది సతీష్‌తో కలిసి రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి కేవలం గంట వ్యవధిలోనే దానిని రికవరీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ స్పందనకు ఫోన్‌ను అప్పగించారు. తన ఫోన్‌ను ఇంత త్వరగా వెతికి పెట్టినందుకు బాధితురాలు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story