Medchal: రెండేళ్లకే నూరేళ్ల నిండు జీవితం బలి.. అల్వాల్‌లో వరకట్న ఘోరం!
Medchal: మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో వరకట్న వేధింపులకు మరో గృహిణి బలైంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడంతో 22 ఏళ్ల సంగీత ఆత్మహత్య చేసుకుంది.
Medchal: రెండేళ్లకే నూరేళ్ల నిండు జీవితం బలి.. అల్వాల్‌లో వరకట్న ఘోరం!
Medchal: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక 22 ఏళ్ల గృహిణి సంగీత ఉరివేసుకుని మృతి చెందింది. వివాహం జరిగిన రెండేళ్లకే ఈ విషాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
గత కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త రమేష్ మరియు అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సంగీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Next Story




