హుజూరాబాద్ BSPకి కొత్త బాస్.. ఇన్చార్జిగా డాక్టర్ అంబాల ప్రభాకర్!

హుజూరాబాద్ నియోజకవర్గ బిఎస్పీ ఇన్చార్జిగా డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ సమక్షంలోనియమితులయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 23 March 2026 7:43 PM IST
Huzurabad
X

హుజూరాబాద్ BSPకి కొత్త బాస్.. ఇన్చార్జిగా డాక్టర్ అంబాల ప్రభాకర్!

హుజూరాబాద్/జమ్మికుంట: హుజురాబాద్ నియోజక వర్గం. బిఎస్పీ హుజురాబాద్ అసెంబ్లీ ఇన్చార్జిగా డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) నల్లాల శ్రీనివాస్ బిఎస్పి జిల్లా అధ్యక్షులు బహుజన సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం హుజురాబాద్ లో సోమవారం ఏర్పాటు చేయగా జమ్మికుంట ప్రాంతానికి చెందిన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) ను

హుజురాబాద్ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ మాట్లాడుతూ హుజురాబాద్ సెగ్మెంట్లో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ నియామకం నేటి నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. నూతనంగా నియామితులైన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) ను

బి ఎస్ పి జోనల్ ఇంచార్జి దొడ్డి సమ్మయ్య, సీనియర్ నాయకులు దొడ్డ శ్రీనివాస్, మారేపల్లి మొగిలయ్య, వేల్పుల మల్లేష్, పల్లె ప్రశాంత్ గౌడ్, కప్పల రవికుమార్ నియోజకవర్గ అధ్యక్షులు మంద సమ్మయ్య, ఉపాధ్యక్షులు పి. శ్రీనివాస్ ఈదునూరి రమేష్, రాచపల్లి రమేష్, దాసరపు మహేందర్ కోరె రంజిత్, బత్తిని సాగర్ మారముల సదయ్య, కండే తిరుపతి , మామిండ్ల మల్లయ్య, బీఎస్పీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మంద జగన్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story