Medak: వైద్య రత్నానికి అంతర్జాతీయ గౌరవం.. మెదక్ వాసులు హర్షం!

Medak: వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన మెదక్ వాసి డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్‌కు 'గ్లోబల్ లీడర్షిప్ అవార్డు–2026' లభించింది.

NAGARAJ, MEDAK
Published on: 19 April 2026 8:10 PM IST
Medak
X

Medak: వైద్య రత్నానికి అంతర్జాతీయ గౌరవం.. మెదక్ వాసులు హర్షం!

Medak: సమాజానికి అంకితభావంతో సేవలందిస్తూ వైద్య రంగంలో విశిష్ట కృషి చేసిన డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్‌కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు–2026 లభించడం మెదక్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్ సమాజ సేవ, నిబద్ధత, నాయకత్వం అనే విలువలకు ప్రతీకగా నిలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వైద్య రంగంలో ఆయన చేసిన కృషి అపారమైనది. ప్రతిభావంతమైన జనరల్ సర్జన్‌గా అనేక మంది రోగులకు శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలను కాపాడడమే కాకుండా, వారికి నూతన జీవం ప్రసాదించారు.

వైద్య వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా ఒక సేవా ధర్మంగా భావించి అంకితభావంతో పనిచేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.తదనంతరం ఆయన రంగారెడ్డి జిల్లా డి.సి.హెచ్.ఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించి ప్రజల ఆరోగ్య సేవల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల మెరుగుదల, ప్రజలకు అందుబాటులో సేవలు అందించడంలో ఆయన పాత్ర ప్రశంసనీయం. ఆ పదవి నుంచి రిటైర్ అయినప్పటికీ ఆయన సేవా యాత్ర అక్కడితో ఆగలేదు.

ప్రస్తుతం ప్రైవేట్ వైద్య రంగంలో సేవలందిస్తూ అనేకమంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తూ తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. జ్ఞానాన్ని పంచడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమనే భావనతో ఆయన ముందుకు సాగుతున్నారు. లయన్స్ క్లబ్ వంటి సేవా సంస్థల్లో చురుకుగా పాల్గొంటూ అనేక సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడుస్తున్నారు.

పేదల సంక్షేమం, ఆరోగ్య సేవలు, విద్యాభివృద్ధి వంటి అనేక రంగాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలను అందిస్తున్నారు. ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.మెదక్ పట్టణానికి చెందిన వ్యక్తిగా డాక్టర్ పిప్పిరి.చంద్రశేఖర్ ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోవడం స్థానిక ప్రజలకు గర్వకారణమైంది.

ఆయన విజయాలు మెదక్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.ఇలాంటి అనుభవం, సేవా భావం కలిగిన వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తే సమాజానికి మరింత విస్తృతంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story