Rangareddy: షాబాద్‌లో గణేష్ లడ్డూ రూ.20,00,001కి అమ్ముడుపోయింది!
Rangareddy: షాబాద్‌లో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో బడా గణేష్ లడ్డూ వేలం పాటలో డీఆర్ కెవీ సిండికేట్ రూ.20,00,001 వెచ్చించి లడ్డూను దక్కించుకుంది.
Rangareddy: హాట్ టాపిక్‌గా మారిన చేవెళ్ల గణేష్ లడ్డూ వేలం పాట!
Rangareddy: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో బడా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బడా గణేష్ లడ్డూ వేలంలో భారీ ధర పలికింది.
బడా గణేష్ లడ్డూను *డీఆర్ కెవీ సిండికేట్ రూ.20,00,001/- (ఇరవై లక్షల ఒక రూపాయి)*కు సొంతం చేసుకుంది. భారీ ధరకు లడ్డూను దక్కించుకోవడంతో భక్తులు, ఉత్సవ సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
గణేష్ లడ్డూ వేలంలో స్థానికులు, భక్తులు, వ్యాపారవేత్తలు, యువత ఆసక్తిగా పాల్గొన్నారు. గణేష్ లడ్డూను దక్కించుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని డీఆర్ కెవీ సిండికేట్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండాల అశోక్, డిప్యూటీ సర్పంచ్ దండు రాహుల్, గ్రామ పెద్దలు, యువత, బడా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజలకు, భక్తులకు ఉత్సవ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




