Dubbaka: ఖాజీపూర్‌లో ఘనంగా సీమంతాలు, అన్నప్రాసన వేడుకలు
Dubbaka: దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని ఖాజీపూర్ గ్రామంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు.
Dubbaka: ఖాజీపూర్‌లో ఘనంగా సీమంతాలు, అన్నప్రాసన వేడుకలు
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని అక్బర్ పేట భూంపల్లి మండల్ ,భూంపల్లి సెక్టార్లో ఖాజీపూర్ గ్రామంలో పోషన్ పక్వాడ్ భాగంగా అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి గర్భిణీ బాలింతలకు పోషక ఆహారం గురించి, ఏడు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు పోషకాహారం గురించి మరియు మూడు నుంచి ఆరు సంవత్సరాల ఫ్రీ స్కూల్ పిల్లలకు అందించే ఫ్రీ స్కూల్ విద్య గురించి మరియు సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లల పోషణ గురించి,
తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా అందుబాటులో ఉండే కూరగాయలు ఆకుకూరలు పండ్లు వాటిలో ఉండే పోషకాల గురించి వాటిని ఎలా వినియోగించడం ద్వారా అందులో పోషక విలువలు మన శరీరం కి ఎలా చెందుతాయి అని చెప్పడం జరిగింది అలానే గర్భవతులకు శ్రీమంతాలు,
పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దుబ్బాక సిడిపిఓ ఎల్లయ్య ,సర్పంచు భాగ్యలక్ష్మి ,మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరి సంయుక్త, అలాగే ఉప సర్పంచ్ గారు, మెడికల్ ఆఫీసర్ ,సెక్టార్ సూపర్వైజర్ రాజేశ్వరి మేడం ,హెల్త్ స్టాప్ అంగన్వాడి టీచర్లు వార్డ్ మెంబర్స్ ,ఆయాలు తల్లులు పాల్గొనడం జరిగింది.




