Dubbaka: అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ అంతుల్ శిరీన్ కోరారు.
Dubbaka: అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, చిన్నారుల భవిష్యత్తుకు మెరుగు పరుచుకోవాలని ఐసిడీఎస్ సూపర్వైజర్ అంతుల్ శిరీన్ అన్నారు. సోమవారం రామక్కపేట సెక్టర్ పరిధిలోని చెల్లాపూర్ 3వ అంగన్వాడీ కేంద్రంలో ఈ సిసి ఈ డే సందర్బంగా పాల్గొని మాట్లాడుతూ.
అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రిలాయన్స్ పౌండషన్ ప్రతినిధి భాస్కర్, అంగన్వాడీ-3 టీచర్ ఆకుల కల్పన, ఆయా మణెమ్మ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Next Story


