School Holidays: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఏకంగా 13 రోజుల పాటు సెలవులు
School Holidays: స్కూల్ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్‌ను అందించింది.
Dussehra Holidays
School Holidays: స్కూల్ విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్‌ను అందించింది. వచ్చే నెలలో రాబోయే బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని విద్యార్థులకు ఏకంగా భారీగా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ ఈ సెలవులు వర్తించనున్నాయి. పండుగ సంబరాలు ఘనంగా జరుపుకోవడానికి విద్యార్థులకు ఈ లాంగ్ హాలిడేస్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
SA-1 పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలు
దసరా సెలవులకు ముందే విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. వివిధ తరగతుల వారీగా పరీక్ష సమయాల్లో మార్పులు ఉన్నాయి:
* 1 నుంచి 5వ తరగతి: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు.
* 6, 8వ తరగతి: ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు.
* 7వ తరగతి: మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు.
* 9వ తరగతి: మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు.
* 10వ తరగతి: ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు
పాఠశాలల్లో పరీక్షలు ముగిసిన వెంటనే అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు అధికారికంగా దసరా సెలవులు కొనసాగనున్నాయి. ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలు ఒకే సమయంలో రావడంతో విద్యార్థులకు సుమారు 13 రోజుల పాటు సెలవుల మజా దక్కనుంది. అక్టోబర్ 11న బతుకమ్మ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 19న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20న విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ 23 నుంచి మళ్లీ పాఠశాలలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయి.




