Nagarkurnool: వింత.. పంది కడుపున ఏనుగు పిల్ల.. అరుదైన ఘటన!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక పంది ఏనుగు ఆకారం ఉన్న పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా కలకలం రేపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 April 2026 8:19 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: వింత.. పంది కడుపున ఏనుగు పిల్ల.. అరుదైన ఘటన!

Nagarkurnool: బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అందులో ఒక వింత పంది కడుపులో ఏనుగు పుట్టిందనే వింత నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పముల గ్రామానికి చెందిన ఎరుకలి వెంకటయ్య పందుల పెంపకంతో జీవనాధారం సాగిస్తుంటాడు.

అందులో ఒక పంది ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ఏడు పిల్లల్లో ఒక పిల్ల మాత్రం ఏనుగు ఆకారంతో జన్మించింది. ఈ ఆకారాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఏనుగు ఆకారం ఉన్న పందిపిల్ల రెండు పెద్ద చెవులు, ఒక తొండం చూడటానికి అచ్చం ఏనుగు పిల్లలా ఉంది.

ఈ వార్త తెలియగానే చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో వెంకటయ్య ఇంటికి చేరుకొని ఈ వింతను చూసి నోరెళ్లపెట్టారు. ఈ వింతైన ఆకారం జన్మించిన కొద్దిసేపటికే మరణించింది. ఏనుగు ఆకారం ఉన్న పంది పిల్ల చనిపోవడంతో గోతి తీసి పుడ్చిపెట్టారు.. ఇది చూసిన గ్రామస్థులు ఇంకా ఎన్ని వింతలు జరుగుతాయో అని అనుకుంటున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story