Medak: పార్కు పేరుతో భూదోపిడీ.. చెరువు మనుగడకే ముప్పు

Medak: మెదక్ జిల్లా కేంద్రంలోని చారిత్రక ఎద్దుల చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది.

NAGARAJ, MEDAK
Published on: 19 April 2026 7:36 PM IST
Medak
X

Medak: పార్కు పేరుతో భూదోపిడీ.. చెరువు మనుగడకే ముప్పు

Medak: బహిరంగ మార్కెట్లో భూముల విలువ పెరిగిపోవడం మెదక్ పట్టణం జిల్లా కేంద్రంగా కావడంతో ప్లాట్లు ధరలు ఆకాశాలుంటాయి. దీంతో కొందరు రియల్ వ్యాపారులు చెరువులను కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు.

వర్షపు నీటిని నిలువ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు నిజాం కాలంలో నిర్మాణం చేసిన చెరువులు కనుమరుగవుతున్నాయి. చెరువులు కనుమరుగవుతున్న అధికారులు అటువైపు చూడడం లేదు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మెదక్ పట్టణంలో కబ్జా గురవుతున్న చెరువులపై ప్రత్యేక కథనం ఇది.

మెదక్ లో కనుమరుగవుతున్న చెరువులు..?

మెదక్ జిల్లా కేంద్రంలోని ఎద్దుల చెరువును కొంతమంది వ్యక్తులు కలిసి కబ్జాకు గురి చేస్తున్నారు. రెవెన్యూ , మున్సిపల్ , నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు భూమిని యథేచ్ఛగా చదును చేస్తూ కబ్జాకు గురి చేస్తున్నారు. మెదక్ ఓల్డ్ బస్ స్టాండ్ నుండి నర్స్కేడ్ వెళ్లే రహదారిలో యదుల చెరువు ఉండేది. మెదక్ చుట్టూ గొలుసుకట్టు చెరువులలో అతిపెద్ద చెరువు ఉంది. ఈ చెరువు సర్వే నంబర్ 700 13 ఎకరాల 22 గంటల భూమి గలది.

కానీ ప్రభుత్వ మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మిగతాది చెరువు ఉండడం మూలంగా ప్రభుత్వం రెవెన్యూ అధికారులు ఏమి చేయలేకపోయారు. కాలం మారుతున్న కొద్దీ పట్టణం పెరుగుతున్న కొద్దీ చెరువుకు నీళ్లు రాకపోవడంతో చెరువు చుట్టూ కబ్జాకు గురవుతూనే ఉంది. అలా విద్యాసంస్థలు ప్రైవేట్ వ్యక్తుల ఇంటి స్థలాలు కబ్జాకు గురయ్యాయి.

గత ప్రభుత్వం మెదక్ జిల్లా కేంద్రంలో బాలికల ఇంటర్మీడియట్ కళాశాలను ఏర్పాటు చేశారు. దీంతో చెరువు మధ్యలోనే నిర్మాణాన్ని కొనసాగించారు. చెరువులోకి నీరు వస్తే కళాశాల జలములవైతుంది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవస్తంగా మారింది. డ్రైనేజీ నీరు చెరువు నీరు ఒకటి కావడంతో చెరువు నీళ్లు కళాశాలకే లోకి వెళ్తాయి. చిన్నపాటి వర్షానికి కళాశాల జలమలమైతుంది. మరే ముఖ్యంగా నర్స్కేడు వెళ్లే రహదారి నేడు కబ్జా చేస్తున్నారు.

కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రైవేటు వ్యక్తులు కలిసి పార్కు పేరుతో కబ్జాకు గురి చేస్తున్నారు . చెరువులోకి మట్టిని తీసుకువచ్చి చెరువును పూడ్చే విధంగా చేసి అట్టి భూమిలో పార్క్ పేరుతో కబ్జా చేసి కోట్లు సంపాదించాలని ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ మున్సిపల్ అధికారులు ప్రభుత్వ భూమిని ఆధీనం తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

అట్టి భూమిని ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగిస్తే బాగుంటుందని కబ్జా కోరల నుండి భూమిని రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story