Hanmanth Shinde: కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ పై మాజి ఎమ్మెల్యే ఫైర్
Hanmanth Shinde: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించకుండా ప్రజలను మోసం చేశారని, దీనిపై క్షేత్రస్థాయిలో పోరాడుతామని ఆయన హెచ్చరించారు.
Hanmanth Shinde: కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ పై మాజి ఎమ్మెల్యే ఫైర్
కామారెడ్డి: తెలంగాణ లో అధికారం లోకి రావడం కోసం ఆరు గ్యారంటీల పెర అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయించకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని జుక్కల్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఈ సందర్భంగా శనివారం ఆయన బిచ్కుంద లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు పై బడ్జెట్ సమావేశంలో ఎలాంటి స్పష్టత లేదని ఓట్లు వేసి అధికారం కట్టబెట్టిన ప్రజలనుండి ఎన్ని ఒత్తిడిలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో కాకి లెక్కలు తప్ప ప్రజా సమస్యలు, అభివృద్ధి పై ఎలాంటి ప్రతిపాదనలు లేవని పేర్కొన్నారు.
తమ బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను పూర్తిగా తుంగలో తొక్కిందని అన్నారు. ఒంటరి మహిళలకు 4 వేల పెన్షన్,నిరుద్యోగులను నిరుద్యోగ భృతి, పి జి విద్యార్థులకు లక్ష రూపాయల సహాయం, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు తులం బంగారం ఇస్తామన్న హామీని అధికారం లోకి వచ్చిన రెండేండ్ల తర్వాత కూడా ఈ హామీలను నెరవేర్చక పోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనార్టీల సంక్షేమాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశారని అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.
గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం.
కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో సరిపెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేసేలా అసెంబ్లీ సమావేశాల్లో తమ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన తమ పార్టీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుల ద్వార ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని మాజి ఎమ్మెల్యే షిండే తెలిపారు. కేవలం ఆరు గ్యారంటీల పేర అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను పూర్తిగా నట్టేట ముంచి దాని దుయ్యబట్టారు.
క్షేత్రస్థాయిలో ప్రజలను ఏకం చేస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుకు నిధులు మంజూరు విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్పర్యాన్ని ఎప్పటికప్పుడు ఎండ గట్టడడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుండి ప్రజలను ఏకం చేసి పోరాటం చేస్తామని దీనికి బి ఆర్ ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న నాయకులు, పార్టీ కార్యకర్తలు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మద్నూర్ సొసైటీ మాజి చైర్మన్ పాకాలి విజయ్, మద్నూర్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బన్నీ పాటిల్, మద్నూర్ మాజీ సర్పంచ్ డి.సూర్యకాంత్, రౌత్వార్.కృష్ణ , శేఖ పూర్ మాజి సర్పంచ్ ఎం.కె. పాటిల్,మైనార్టీ నాయకుడు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.




