Jagtial: తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి నూకపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఫైర్!

Jagtial: జగిత్యాల జిల్లా నూకపల్లి వరద కాలువను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 2:04 PM IST
Jagtial
X

Jagtial: తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి నూకపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఫైర్!

జగిత్యాల జిల్లా: మల్యాల మండలం నూకపల్లి వరద కాలువను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక బిఆర్ ఎస్ నాయకులతో కలిసి కాలువ పరిస్థితిని పరిశీలించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభలో కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఒక అద్భుతమైన నిర్మాణమని, దీనిపై తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story