Nizamabad: తేమ పేరుతో తరుగు.. నిలువునా మోసం

Nizamabad: బోధన్‌లో రైస్ మిల్లర్ల దోపిడీ. తేమ, బస్తా తూకం పేరుతో క్వింటాలుకు 4 కిలోల తరుగు. విండో సిబ్బందితో కుమ్మక్కై రైతులను వేధిస్తున్న మిల్లర్లు.

K RAVI, BODHAN
Published on: 19 April 2026 11:56 AM IST
Nizamabad
X

Nizamabad: తేమ పేరుతో తరుగు.. నిలువునా మోసం

నిజామాబాద్ జిల్లా: బోధన్ డివిజన్ పరిధిలోని వివిధ రైస్ మిల్లర్లు రైతులు నిలవు దోపిడీకి గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తే మిల్లర్లు ఇదే ఆధునిక భావించి రైతులను తేనె పేరుతో నీలువు దోపిడి చేస్తున్నట్లు హలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారి వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తుంది. మిల్లర్లు సిండికేట్ గా మారి రైతుల వద్ద నుండి 40 కిలోల బ్యాగుకు కు కిలోన్నర చొప్పున తేమ పేరుతో, బస్తాతూకమ్ పేరిట క్వింటాలు ధాన్యానికి నాలుగు కిలోల చొప్పున తరుగు తీయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుదురు మండల కేంద్రంలో పాటు వివిధ విడో కార్యాలయాల్లో రైతులు ఆందోళన నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధర లభిస్తుందని తాముల ద్వారా ధాన్యాన్ని అప్పయించినప్పటికీ విండో సిబ్బంది మిల్లర్లు కుమ్మక్కై తమను దోపిడీకి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల పేరుతో మిల్లర్లు వేధింపులకు గురి చేయడం సరికాదని చేయడం సరికాదని రుద్రూర్ విండో కార్యదర్శి గంగాధర్ ను రైతులు నిలదీశారు. జిల్లా కలెక్టర్ స్పందించి బోధన్ డివిజన్లోని మిల్లర్లు ఆగడాలను అరికట్టాలని వారి నుండి రైతులను కాపాడాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని అప్పగించినప్పటికీ రూ.23 89 క్వింటాకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దాన్యం కాటా చేయాల్సి ఉంటే ముందుగా విండో సిబ్బందికి సపరియాలు చేయాల్సిందేనని లేని పక్షాన రైతుల ధాన్యాన్ని సీరియల్ ప్రకారం తీసుకుంటామని ఇబ్బందులు కురిచేస్తున్నట్లు పలు రైతులు ఆరోపించారు.

బస్తాకు రెండు రూపాయలు ట్రాన్స్ఫర్ ఖర్చు రైతులే భరించాల్సి వస్తుందని ట్రాన్స్పోర్ట్ కు డబ్బులు చెల్లించకపోతే ధాన్యాన్ని ఎత్తడం లేదని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. విండో సిబ్బంది లారీ అవమానులతో కుమ్మక్కై అన్ని విధాల రైతులను ఇబ్బందులకు చేస్తున్నారని రుతురు మండల కేంద్రంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని క్వింటాల్గు నాలుగు కిలోల తరుగును గురించి మిల్లర్ల నుండి.రైతులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story