Karimnagar: కొనుగోలు కేంద్రాల వద్ద చల్లని నీడ కోసం.. రైతుల మొర!

Karimnagar: చొప్పదండిలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రైతులు. వ్యవసాయ పనుల సమయాలను మార్చుకుని శ్రమిస్తున్న అన్నదాతలు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 19 April 2026 11:29 AM IST
Karimnagar
X

Karimnagar: కొనుగోలు కేంద్రాల వద్ద చల్లని నీడ కోసం.. రైతుల మొర!

కరీంనగర్ జిల్లా: చొప్పదండి నియోజకవర్గం లోని రైతులు వేసవికాలంలో తీవ్ర ఎండల కారణంగా తమ వ్యవసాయ పనుల సమయాలను మార్చుకుని పని చేస్తున్నారు. ముఖ్యంగా వరి కోతలతో పాటు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు నేర్పే పనులను ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నామని రైతులు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత ఎండ వేడిమి తీవ్రంగా పెరగడంతో పనులు కొనసాగించడం చాలా కష్టంగా మారుతోందని వారు అన్నారు.

అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత మళ్లీ ఇంటి నుంచి పొలాలకు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు మధ్య మధ్యలో ఓఆర్ఎస్, మజ్జిగ తీసుకుంటూ రోజుకు సుమారు నాలుగు నుంచి 5 లీటర్ల వరకు నీరు తాగుతున్నామని తెలిపారు.

అందువల్ల రైతుల కోసం కొనుగోలు కేంద్రాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story