Rangareddy: రంగారెడ్డి జిల్లా రైతుల ఆవేదన.. సోమాజిగూడ ప్రెస్ మీట్!

Rangareddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దు గ్రామానికి చెందిన రైతు కుటుంబం ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం. తాతల నాటి భూముల హక్కులకోసం వేడుకోలు.

RAJESH,	WEST ZONE
Published on: 29 Sept 2026 10:03 AM IST
Rangareddy
X

Rangareddy: రంగారెడ్డి జిల్లా రైతుల ఆవేదన.. సోమాజిగూడ ప్రెస్ మీట్!

Rangareddy: తాతల నాటి నుంచి సాగు చేస్తూ వస్తున్న తమ భూములు తమ వేనని నిరూపించుకోవాల్సిన రావడం విచారకరమని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దు ( ఏ) గ్రామానికి చెందిన రైతు కుటుంబం మీడియా ముందు వాపోయింది.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు శ్రీరాములు, రాజకుమార్, ప్రమీల, సుశీల మాట్లాడారు. గ్రామ పరిధిలోని 384 నుంచి 386, 388 నుంచి 394 వరకు ఉన్న సర్వే నెంబర్లలో గల 18 ఎకరాల భూమి ఇనాం ద్వారా తమ ముత్తాత రామయ్యకు సంక్రమించిందని తెలిపారు.

ఆనాటి నుంచి ఐదు తరాలుగా సదరు భూమిలో వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. 2007వ సంవత్సరంలో సదరు భూమి వక్ఫ్ స్థలమంటూ వివాదం చెలరేగగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు.

పూర్తి యాజమాన్య హక్కులు కలిగిన తమ భూమిని కొందరు మాదే అంటున్నారని పత్రికల్లో వచ్చిన వార్త కథలను చూసి తాము విస్మయానికి గురయ్యామని చెప్పారు.

ఐదు తరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని తమదేనని నిరూపించుకోవాల్సిన రావడం తీవ మనోవేదన గురిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇతరుల భూములపై కన్నేసి కాజేసేందుకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, భూషణ్ నరసింహ, పవన్ తదితరులు పాల్గొన్నారు

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE