Fire Accident: బూడిదైన నిరుపేదల ఇండ్లు.. కన్నీటి పర్యంతమైన బాధితులు

Fire Accident: పుల్కల్ మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ కావడంతో అవసలి లక్ష్మణ్, పాండురంగం ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 April 2026 8:03 PM IST
Fire Accident
X

Fire Accident: బూడిదైన నిరుపేదల ఇండ్లు.. కన్నీటి పర్యంతమైన బాధితులు

Fire Accident: ప్రమాదవశాత్తు రెండు ఇండ్లు దగ్ధమైన సంఘటన ఆదివారం మండల కేంద్రం పుల్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే పుల్కల్ గ్రామానికి చెందిన అవసలి లక్ష్మణ్, అవుసలి పాండురంగం కు సంబంధించిన ఇండ్లు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైపోయాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి బాధిత కుటుంబాలను పరామర్శించి ఇరు కుటుంబాలకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఓదార్చారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రెండు ఇండ్లు ( పూరి గుడిసెలు ) వాళ్లు ఇంట్లో లేని సమయంలో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వాళ్ళు గమనించి అవసలి లక్ష్మణ్ కు సమాచారం అందించగా బాధితుడు లక్ష్మణ్ హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకునేసరికి ఇల్లు మొత్తం పూర్తిగా తగలబడిపోయింది.మంటలు పెద్దగా వ్యాపించడంతో అన్న పాండురంగం ఇల్లు కూడా తగలబడిపోయిందన్నారు.

గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగడంతోనె భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు వాపోయారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల సభ్యులు బోరున విలపించారు. కనీసం కట్టుకోవడానికి బట్టలు సైతం లేకుండా బూడిద అయిపోయాయని కన్నీటి పర్యంతమయ్యారు. సుమారుగా రెండు ఇండ్లలో కలిపి పది హేను లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు విలేకరులతో తెలిపారు.

ఆర్థికంగా నష్టపోయిన ఇరు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి డిమాండ్ చేశారు.అలాగే గ్రామ సర్పంచ్ చిరంజీ లావణ్య కృష్ణారెడ్డి బాధిత కుటుంబాలకు తన వంతు సహాయంగా వస్తువులను, కిరాణా సామాన్లను అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story