Adilabad: హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చిన బాపూరావు.. జాగృతిలో కొత్త ప్రయాణం

Adilabad: బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆ సంస్థలో చేరారు.

NAGULA SATISH, BOATH
Published on: 19 April 2026 6:37 PM IST
Adilabad
X

Adilabad: హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చిన బాపూరావు.. జాగృతిలో కొత్త ప్రయాణం

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో చేరారు.

గతంలో బోథ్ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేసిన బాపూరావుకు, గత ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గౌరవం లభించడం లేదని, పార్టీ కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఆయన గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి కవిత ఆధ్వర్యంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో, బోథ్ రాజకీయ సమీకరణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story