Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డ!

Telangana: తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 July 2026 10:41 PM IST
Telangana
X

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డ!

తెలంగాణ: నదుల నీళ్లపై రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖత్వం తో వ్యవహరిస్తోంది , రేపు వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సివస్తోందని ఇపుడు పంటలు పండించొద్దంటూ రైతులపై ఆంక్షలు పెడుతున్నారు నిన్న ఢిల్లీ వేదికగా ఉత్తమ్ మరోసారి అజ్ఞాని లా మాట్లాడారు, కాళేశ్వరం పై అవే మూర్ఖవు మాటలు మాట్లాడారు అన్నారం ,సుందిళ్ల బాగున్నాయని ఉత్తమే శాసన మండలిలో చెప్పారు యాసంగిలో పంట కొనడం లో ఫెయిల్ అయ్యారు.

సన్న వడ్ల కు బోనస్ అంటే రైతులు అటు వైపు మళ్ళారు వడ్లు కొనాల్సి వస్తే బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని అసలు వరి యే పండించకూడదు అనే కుట్రకు తెర లేపుతున్నారు కర్ణాటకు నుంచి వరద వస్తున్నా జూరాల నుంచి నీళ్లు పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయడం లేదు రైతును వ్యవసాయానికి దూరం చేసే కుట్ర ను పకడ్బందీగా అమలు చేసే పనే ఇదంతా 12 గంటలకు మించి కరెంటు ఉండటం లేదు ..కరెంటు ఇస్తే పంటలు పండుతాయి అని కరెంటు కట్ చేస్తున్నారు తాగు నీళ్లు కూడా సరిగా ఇవ్వడం లేదు.

కేసీఆర్ హాయం లో ఐదేళ్లు ఇంటింటికి నీళ్లు వచ్చాయి 2014 నవంబర్ నుంచి అందరికీ 24 గంటలు కరెంటు ఇచ్చాము వరుసగా ఆరేళ్లు 24 గంటలు రైతులకు కరెంటు ఇచ్చాము ఇపుడు బోరు మెషిన్లకు డిమాండ్ వచ్చింది రాష్ట్రం లో రేవంత్ సమైక్య రాష్ట్రంలో తన గురువు చేసిన పాలన ను ఇపుడు మళ్ళీ తెచ్చారు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్న మాటలను రేవంత్ అక్షరాల అమలు చేస్తున్నాడు హైదరాబాద్ లో కరెంటు ఎపుడు వస్తుందో ఎపుడు పోతుందో తెలియడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ కు కూడా రైతులు నానా యాతన పడుతున్నారు కొత్త గూడెం లో 500 మెగావాట్ల కేంద్రాన్ని బంద్ పెట్టారు.

యాదాద్రి లో 4 ఉంటే రెండే నడుపుతున్నారు సింగరేణి లో బొగ్గు కుంభకోణం చేశారు ధర్మల్ కేంద్రాలకు బొగ్గు కూడా సరిగా సరఫరా చేయడం లేదు కేసీఆర్ ఏం మాయచేశారో గోదావరి జిల్లాల్ల లాగా తెలంగాణ జిల్లాల ను సస్యశ్యామలం గా మార్చాడు అని ఆంధ్రా వాళ్లు కూడా చెప్పేవారు ఇపుడు ఇక్కడ నాట్లు సరిగా పడలేదు కానీ ఇక్కడ్నుంచి వెళ్లిన నీళ్లతో గోదావరి జిల్లాల్లో నాట్లు వేసుకున్నారు.

200 టీఎంసీ ల గోదావరి నీళ్లు తెలంగాం నుంచి సముద్రం లో కలిశాయి ఎల్లంపల్లి పద్దతిలో కన్నెపల్లి పంపులు ఆన్ చేయాల్సిందే శ్రీరామ్ సాగర్ కు వరద పెద్దగా లేదు కన్నెపల్లి లో లిఫ్ట్ మొదలు పెట్టి అన్ని రిజర్వాయర్ల ను నింపాలి సూర్యపేట వరకు నీళ్లు ఇవ్వాలంటే కన్నెపల్లి ఆన్ కావాల్సిందే రైతులకు నీళ్లు ,కరెంటు ఇస్తే కమిషన్ రాదనే వాళ్లకు వ్యవసాయం పై ఇంట్రస్టు లేదు ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులను రేవంత్ రెడ్డి క్రిమినల్ వెస్ట్ అనడం దుర్మార్గం రేవంత్ వ్యాఖ్యలపై ఇంజనీరింగ్ విద్యార్థులను అడిగితే వాళ్ళే గట్టిగా సమాధానం చెబుతారు చదువుకున్నోడికి తెలుసు చదువు విలువ చదువురాని rవాళ్ళు కూడా తమ పిల్లలను బాగా చదివించాలనుకుంటారు.

రేవంత్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు కేసీఆర్ వెయ్యి కి పైగా గురుకులాలు పెట్టారు. తెలంగాణ జెన్ జీ పిల్లలను కదిలించి చూడండి ..వాళ్ళు ఢిల్లీకి తగ్గకుండా మాట్లాడుతున్నారు .ఇది గురుకులాల పుణ్యమే కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలేదు .పని చేసుకుంటూ పోయారు గురుకులాల్లో చదివిన పిల్లలు ఎత్తైయినా పర్వతాలు ఎక్కారు మన గురుకులాల్లో చదివిన పిల్లలు ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందారు రేవంత్ ను సీఎం చేసుకోవడమే రాష్టానికి పెద్ద క్రిమినల్ వేస్టు గురుకులాల్లో 200 మంది విద్యార్థులను చంపిన ఘనుడు రేవంత్ రెడ్డి.

గురుకులాల్లో విషాహారం తిని అస్వస్థత పాలవుతున్నారు, విద్యాశాఖ చాలా కీలకమైంది ..నేను జిల్లా రాజకీయాలకు సమయం కేటాయించడం ముఖ్యం కనుక ఆ శాఖ ను నిర్వహించలేనని కేసీఆర్ కు చెప్పా రేవంత్ రెడ్డి తన వల్లే విద్యాశాఖ నిర్వహణ సాధ్యమని చెబుతూ మిగతా మంత్రులను అవమానపరుస్తున్నాడు ఒక చిన్న అనారోగ్యం వార్త వస్తేనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ లో కేసీఆర్ నర్స్ ను పెట్టారు.

వందల మంది పిల్లలు చనిపోయినందుకు రేవంత్ రెడ్డి పై క్రిమినల్ కేసులు పెట్టాలి బీసీ లను మోసం చేసినట్టే యువత ను రేవంత్ మోసం చేస్తున్నారు ఎమ్మెల్యేల పోటీ వయసును 25 నుంచి 21 కి తగ్గించాలనుకుంటే రాహుల్ గాంధీ చెప్పాలి .రేవంత్ చెబితే అవుతుందా అసెంబ్లీ ఒక్క రోజు ఎందుకు ?నెల రోజులు పెట్టమనండి రేవంత్ ఏదో మాట్లాడితే బీ ఆర్ ఎస్ ఎందుకు స్పందించాలి కేశవరావు ,జైపాల్ రెడ్డి లే తెలంగాణ లో ఇద్దరు మేధావులు అంటున్నారు ..తన తర్వాతే వాళ్ళు అని రేవంత్ అభిప్రాయమేమో ఎన్ డీ ఎస్ ఏ ఎస్ ఎల్ బి సీ కి ఎందుకు రాలేదో ఉత్తమ్ చెప్పాలి.

ఎన్ డీ ఎస్ ఏ ను బూచీగా చూపుతూ కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయడం లేదు మంత్రులు స్ట్రీట్ రౌడీ ల్లా మాట్లాడుతున్నారు చంద్రబాబు రైతులను ఎంత హింసించారో అంతకన్నా రేవంత్ ఎక్కువగా హింసిస్తున్నారు రైతులకు సాగునీరు ,కరెంటు సరఫరాల్లో ఇబ్బందులు వచ్చి పంటలు ఎండిపోతే బీ ఆర్ ఎస్ చూస్తూ ఊరుకోదు, మేడిగడ్డ లో నీళ్లు ఆపితే భద్రాచలం కొట్టుకుపోతుంది అంటున్నవారు ..రేపు తుమ్మిడి హట్టి కడితే చెన్నూరు కొట్టుకుపోతుంది అని అనలేరా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story