Balka Suman: వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బాల్క సుమాన్

Balka Suman: తన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వివరణ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 27 May 2026 2:11 PM IST
Balka Suman
X

Balka Suman: వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బాల్క సుమాన్ 

Balka Suman: వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నాపై డీజీపీకి ఫిర్యాదు చేశారట, ప్రభుత్వానికి ప్రశ్నిస్తే అరెస్టులు,కేసులు పెడుతున్నారు. సింగరేణి కుంభకోణంని పక్క దారి మళ్లించేందుకు.. కాంగ్రెస్ సోషల్ మీడియా తప్పుడు ఆరోపణలని ప్రచారం చేస్తుంది.

నా వీడియోని ఫ్యాబ్రికేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని బాల్కసుమాన్ తెలిపారు. ముఖ్యమంత్రి బామ్మర్దికి సింగరేణి బంగారు బాతుగా మారిందన్నారు. కార్మికుల పక్షాన సింగరేణి పై పోరాటం చేయాలని, వారి హాక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని మాట్లాడినట్లు బాల్క సుమాన్ వివరణ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story