Gangula Kamalakar: కరీంనగర్‌లో ఉద్రిక్తత .. మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్
కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.
Gangula Kamalakar House Arrest
కరీంనగర్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంద్ నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు గంగుల కమలాకర్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు గంగుల నివాసానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఇంటి బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గంగుల కమలాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
కరీంనగర్‌లో బంద్ ప్రభావం కనిపిస్తుండగా, గంగుల కమలాకర్ అరెస్ట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.




