Medchal: జీనోమ్ వ్యాలీలో గంజాయి ముఠా గుట్టురట్టు!
Medchal: మేడ్చల్ జిల్లా జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Medchal: జీనోమ్ వ్యాలీలో గంజాయి ముఠా గుట్టురట్టు!
మేడ్చల్: జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులతో పాటు వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు వినియోగదారులతో పాటు నలుగురు విక్రయదారులు పట్టుబడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నాయిని కార్తీక్ (22), కేతావత్ సంజయ్ కుమార్ (24), మూడుచింతపల్లి ప్రాంతానికి చెందిన సాదుల రవి (23), మూడుచింతపల్లి మున్సిపాలిటీ పోతారం గ్రామానికి చెందిన బెమ్మారి మధు (22)లు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
వారితో పాటు మూడుచింతపల్లికి చెందిన చిమ్ముల యుగేందర్ రెడ్డి, భువనగిరి జిల్లా బొమ్మలరామారం తిమ్మాపూర్‌కు చెందిన కసమైన ప్రశాంత్ వినియోగదారులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు నిందితులపై జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




