Hyderabad: అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు.. ఫుట్‌పాత్‌లకు విముక్తి!

Hyderabad: అత్తాపూర్ నుండి శివరాంపల్లి వరకు ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 18 April 2026 11:00 AM IST
Hyderabad
X

Hyderabad: అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు.. ఫుట్‌పాత్‌లకు విముక్తి!

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్ సర్కిల్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలపై కొరడా ఝుళిపించిన మున్సిపల్ అధికారులు. అత్తాపూర్ నుండి శివరాం పల్లి వరకు అక్రమంగా నిర్మించిన ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆక్రమణదారుల నుండి స్పందన రాకపోవడంత టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు నిర్వహించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని GHMC అధికారులు హెచ్చరించారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story