Kunaram: కునారంలో ఘనంగా గిట్ల ముకుంద రెడ్డి వర్ధంతి వేడుకలు

Kunaram: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుంద రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారంలో ఘనంగా జరిగాయి.

Srimanthula Kondal, Peddapalli
Published on: 19 April 2026 4:04 PM IST
Kunaram
X

Kunaram: కునారంలో ఘనంగా గిట్ల ముకుంద రెడ్డి వర్ధంతి వేడుకలు

Kunaram: పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే ముకుంద రెడ్డి సేవలు మరువలేనివని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు గిట్ల ముకుంద రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఆయన స్వగ్రామంలోని ముకుంద రెడ్డి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ముకుంద రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ప్రజల మనిషిగా, నిగర్విగా ఆయన సంపాదించుకున్న పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ సర్పంచ్ మంతెన రాజయ్య మాజీ ఎంపిటిసి కొల్లూరి రామా రాయమల్లు ఉప సర్పంచ్ బోడకుంట్ల తిరుపతి కొట్టే రవీందర్, కొట్టే సమ్మయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story