Balmoor Venkat: బల్మూర్ వెంకట్ ఫైర్: "కేసీఆర్ అనే చాప్టర్ క్లోజ్.. జైలుకు పంపడమే మిగిలింది!"
Balmoor Venkat: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలపై ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Balmoor Venkat: బల్మూర్ వెంకట్ ఫైర్: "కేసీఆర్ అనే చాప్టర్ క్లోజ్.. జైలుకు పంపడమే మిగిలింది!"
Balmoor Venkat: తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అనే అధ్యాయం ముగిసిన ముచ్చట అని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ విమర్శించారు. మంగళవారం CLP మీడియా సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ ఫిరాయించిన జీవన్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు.
"తెలంగాణను పదేళ్లపాటు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపుతామని మేం హామీ ఇచ్చాం.. ఆ ఒక్క హామీని మాత్రమే ఇప్పటివరకు నెరవేర్చలేకపోయాం" అని బల్మూర్ వెంకట్ వ్యాఖ్యానించారు. ప్రజలే కేసీఆర్‌ను రాజకీయంగా సమాధి చేశారని, పులి వస్తోందంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసుకునే ప్రచారం కేవలం బిల్డప్ కోసమేనని ఎద్దేవా చేశారు.
జీవన్ రెడ్డిని పొలిటికల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి అనుకున్నామని, కానీ ఆయన తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని నిన్న అర్థమైందని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్ పట్టించుకోలేదని, రేపు జీవన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదన్నారు.
ధరణి పేరుతో తెలంగాణలో అతిపెద్ద భూ కుంభకోణం జరిగిందని, ఇప్పుడు 'హైడ్రా' ఆ భూములను కాపాడుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ అలియాస్ 'దుబాయ్ శేఖర్'కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి తాను దొంగతనం చేయలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు కూడా వెళ్లలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు.
హరీష్ రావు బీఆర్ఎస్‌లో ఉంటాడా లేదా అనే సందేహం నెలకొందని, ఆయన సన్నిహితులే ఈ విషయాన్ని చెబుతున్నారని బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




