Medak: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం.. కలెక్టర్ ప్రతిమా సింగ్

Medak: మెదక్ జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 April 2026 4:04 PM IST
Medak
X

Medak: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం.. కలెక్టర్ ప్రతిమా సింగ్

Medak: మెదక్ జిల్లా కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు జిల్లా అధికారుల నిర్వహించిన మహాత్మ జ్యోతిబాపూలే 200 సంవత్సరం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దాన్ చంద్ చౌరస్తాలోని జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలుని వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేశాడని విద్యతో సామాజిక మార్పు జరుగుతుందని భావించిన ఏకైక వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అని కొనియాడారు అనంతరం జిల్లా అదునపు కలెక్టర్ నగేష్ టీఎన్జీవో నాయకులు. దొంతి నరేందర్ రాజ్ కుమార్ మెజార్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజ్ రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా తదితరులు మాట్లాడాతు.

సమాజంలో విద్యా లేక పోతే అందాకారమైపోతున్న తరుణంలో మహాత్మ జ్యోతిబాపూలే. విద్య యొక్క ఆవిష్కతను సమాజానికి తెలియజేయడమూలంగా సామాజిక విప్లవం రావడం జరిగిందని వారు తెలిపారు అనంతరం విద్యార్థులు మహాత్మా సావిత్రిబాయి పూలే నాటికలు సందర్శించారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు ఫూలే అని మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతి రాజు అభివర్ణించారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎం. గంగాధర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లతో కలిసి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధిక భూపతి రాజు మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్యనే శక్తివంతమైన ఆయుధంగా భావించిన మహనీయుడు పూలే అని తెలిపారు.

విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు స్థాపించడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడడం, వితంతు పునర్వివాహానికి నాంది పలకడం వంటి అనేక సామాజిక సంస్కరణలు చేపట్టారని వివరించారు.గౌతమ బుద్ధుడు మొదటి సామాజిక విప్లవకారుడిగా, తరువాత కాలంలో మహాత్మ జ్యోతిబా పూలే గొప్ప సంఘ సంస్కర్తగా అవతరించి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. నిమ్న వర్గాల అభివృద్ధికి విద్య అత్యవసరమని ముందుగానే గుర్తించి దానికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.

పూలే దంపతులు తమ జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని కొనియాడారు. పూలే తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పించి, సావిత్రిబాయి ఫూలేను భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిపారని తెలిపారు. ఆమె స్ఫూర్తితోనే నేటి మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఎందరో మహానుభావులు మహాత్మ జ్యోతిబా పూలేను తమ గురువుగా భావించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు హరిత, అరుణ, శివరామకృష్ణ, సంపత్, నర్సింలు, నాయకులు భూపతి రాజ్, సయ్యద్ ఉమర్, వెంకటనారాయణ, సిద్ధిరాములు, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ కొనియాడారు. శనివారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

జ్యోతిబా ఫూలే చూపిన మార్గంలో నడుస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమాన న్యాయం అందాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమని నమ్మి, ఆ దిశగా పోరాడిన మహనీయుడు ఫూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి. జగపతి, అకిరెడ్డి కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్ రావు,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ. ఆంజనేయులు,

కోకన్వీనర్ లు కిష్టా గౌడ్,లింగారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, గౌస్, పార్టీ నాయకులు ప్రభు రెడ్డి, సురేందర్ గౌడ్,మాయ మల్లేశం, ఆర్కే. శ్రీనివాస్, కిషోర్ కుమార్, చంద్రశేఖర్ గౌడ్,గట్టేష్,ఇస్మాయిల్, సునీల్, సంతోష్,సాయి కుమార్, బాలరాజు, నరేందర్, శంకర్, నవీన్, కనక చారి, కిరణ్, స్వామి నాయక్ ఎంబిపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story