Jagtial: ముగిసిన శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్ఠ.. భక్తుల భారీ సందడి!
Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో శ్రీ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
Jagtial: ముగిసిన శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్ఠ.. భక్తుల భారీ సందడి!
జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండలం పూడూరు గ్రామం ఈరోజు ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. ఎంతోకాలంగా గ్రామ ప్రజల ఆకాంక్షగా నిలిచిన శ్రీ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఉదయం వేళ నుంచే వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య యజ్ఞాలు, హోమాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం పవిత్రతతో నిండిపోయింది. శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేవుడి విగ్రహానికి జీవప్రతిష్ఠ కల్పించగా, ఆ క్షణాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పరవశంలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు అందరూ ఏకమై పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయాన్ని అందంగా అలంకరించడంతో పాటు ప్రత్యేక పూజలు, అర్చనలు, నిర్వహించడంతో పూడూరు గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు శ్రీరాముడి దర్శనం కోసం క్యూలలో నిలబడి, కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.




