Gutha Sukender Reddy: డీలిమిటేషన్‌పై గుత్తా సుఖేందర్ రెడ్డి మార్క్ ఫార్ములా: 50% జనాభా.. 50% జీఎస్టీ!
Gutha Sukender Reddy: డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Gutha Sukender Reddy: డీలిమిటేషన్‌పై గుత్తా సుఖేందర్ రెడ్డి మార్క్ ఫార్ములా: 50% జనాభా.. 50% జీఎస్టీ!
Gutha Sukhender Reddy: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ నిర్వహిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా 50 శాతం జనాభా, మరో 50 శాతం జీఎస్టీ (GST) ఆదాయం ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉండాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానాన్ని ప్రతిపాదించిందని, అయితే దక్షిణాది హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును వేర్వేరుగా ప్రవేశపెట్టాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నట్లు వెల్లడించారు. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే.. తొలుత 18 రాష్ట్రాలు ఒకసారి, మిగిలిన రాష్ట్రాలు మరో విడతలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. అసలు పార్టీ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కారమయ్యాయని, సన్నధాన్యం సేకరణ సజావుగా సాగుతోందని చెప్పారు. సాగునీటి కాలువల లైనింగ్‌కు ముందే విస్తరణ పనులు చేపట్టడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.




