Toguta: ఫోటోల పేరుతో ఉపాధి కూలీలను వేధించొద్దు.. హరికృష్ణ రెడ్డి
Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులలో ఉపాధి హామీ కూలీలకు రాగిజావ పంపిణీ చేశారు.
Toguta: ఫోటోల పేరుతో ఉపాధి కూలీలను వేధించొద్దు.. హరికృష్ణ రెడ్డి
Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడికందుల గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి రాగిజావను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలు తీవ్రతరం అయితున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ సూచనల మేరకు ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయని కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపాధి హామీ కూలీలను కొత్త నిబంధనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలువేధిస్తున్నాయని ఆరోపించారు. కూలి పనులకు వచ్చిన కూలీలను ఫోటోల పేరుతో వేధించడం సరికాదని మండిపడ్డారు.
ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయన్నారు. కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులను జరిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కూలీలకు దాదాపుగా రెండు నెలలుగా వేతనాలు పడడం లేదని వెంటనే వారికి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.




