Harish Rao: హుటాహుటిన ఢిల్లీకి హరీష్‌రావు.. ఎందుకంటే..?

Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశంపై న్యాయవాదులతో చర్చించనున్నారు.

Arun Chilukuri
Published on: 20 April 2026 12:31 PM IST
Harish Rao
X

Harish Rao: హుటాహుటిన ఢిల్లీకి హరీష్‌రావు.. ఎందుకంటే..?

Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్‌రావు అకస్మాత్తుగా ఢిల్లీకి పయనమవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరుగుతున్న సమయంలోనే హరీష్‌రావు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ కీలక కేసులో ఎల్లుండి హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మరియు బీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత కీలకం కానుంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన అంశాలపై చర్చించేందుకు హరీష్‌రావుతో పాటు వినోద్ రావు కూడా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో వారు భేటీ కానున్నారు.

ఒకవేళ హైకోర్టు తీర్పు గనుక పార్టీకి లేదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వస్తే.. తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ముందస్తుగా లీగల్ గ్రౌండ్స్ సిద్ధం చేసుకోవడం కోసమే ఈ పర్యటన అని పార్టీ వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. జగిత్యాల సభకు హరీష్‌రావు హాజరుకాకపోవడం వెనుక ఈ భారీ న్యాయపోరాట వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story