Harish Rao: రేవంత్ రెడ్డి కాదు.. ఆయన 'గోబెల్స్ రెడ్డి'
Harish Rao: మూసి నది ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది పునర్జీవనం కాదు, కేవలం దోపిడీ మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.
Harish Rao: రేవంత్ రెడ్డి కాదు.. ఆయన 'గ్లోబల్స్ రెడ్డి'
Harish Rao: మూసి నది ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది పునర్జీవనం కాదు, కేవలం దోపిడీ మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు.
పునర్జీవనానికి మేము వ్యతిరేకం కాదు కానీ..
"మేము మూసి నదిని శుద్ధి చేయడానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో జరుగుతున్న లూటీని, పేదల ఇళ్ల కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అసలు ప్రభుత్వం చేస్తోంది ప్రక్షాళననా? పునర్జీవనమా? లేక సుందరీకరణనా? దీనిపై రేవంత్ రెడ్డికి ఏమైనా క్లారిటీ ఉందా?" అని హరీష్ రావు ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి కాదు.. 'గ్లోబల్స్ రెడ్డి'
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు 'గ్లోబల్స్ రెడ్డి'గా అభివర్ణించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వం, లక్ష కోట్ల రూపాయలు మూసి కోసం ఎక్కడి నుండి తెస్తోందని నిలదీశారు. వందల కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టడానికి, ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయని, పేదలకు ఇవ్వడానికి మాత్రం లేవా? అని ప్రశ్నించారు.
బుల్డోజర్ రాజకీయాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి:
"యుపీలో బుల్డోజర్ సంస్కృతిపై మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇక్కడ జరుగుతున్న బుల్డోజర్ యుద్ధానికి ఆయన సమాధానం చెప్పాలి. 10 వేల ఇళ్లు కూల్చేసి లక్ష మంది జీవితాలను రోడ్డుపై పడేస్తారా?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసిని ప్రక్షాళన చేయాలంటే వికారాబాద్ నుండి ప్రారంభించాలని, కాంగ్రెస్ వచ్చాక అక్కడ ఎస్టీపీ (STP)లు పని చేయడం లేదని ఆరోపించారు.




