Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌రావు గృహనిర్బంధం.. కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తత!
Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌రావును కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌రావు గృహనిర్బంధం.. కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తత!
Harish Rao: బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును పోలీసులు బుధవారం ఉదయం గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు. సనత్‌నగర్‌లోని 'టిమ్స్' (TIMS) ఆసుపత్రిని సందర్శించేందుకు బయలుదేరిన ఆయనను, పోలీసులు అనుమతి లేదంటూ కోకాపేటలోని ఆయన నివాసంలో అడ్డుకున్నారు.
హరీశ్‌రావు అరెస్ట్ వార్త తెలియడంతో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోకాపేటలోని ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.
సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి పరిశీలనకు వెళ్లకుండా ఇతర బిఆర్ఎస్ కీలక నేతలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలను సైతం పోలీసులు వారి నివాసాల్లోనే గృహనిర్బంధం చేశారు.
పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం విధిస్తున్న నిర్బంధాలు, హౌస్ అరెస్ట్‌లను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని లోపాలు, పాలనాపరమైన డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఈ విధంగా అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.




