Harish Rao: శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత.. ఆ రోజును 'అప్పాయింటెడ్ డే'గా ప్రకటించాలి
Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Harish Rao: శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత.. ఆ రోజును 'అప్పాయింటెడ్ డే'గా ప్రకటించాలి
Harish Rao: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్టీసీని కాపాడేందుకు కార్మికుల హక్కుల కోసం శంకర్ గౌడ్ ప్రాణత్యాగం చేసుకున్నారని హరీష్ రావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ అడంగా ఉంటుందని హామీ ఇచ్చారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప.. ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దన్నారు.
శంకర్ గౌడ్ అమరుడైన రోజును అప్పాయింటెడ్ డే గా ప్రకటించి.. ఆయన త్యాగానికి గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని.. ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంతో ఈ దుస్ధితి వచ్చిందన్నారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతారని హరీష్ రావు ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను పరిగణలోకి తీసుకోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.




