Pilot Rohit Reddy: పైలెట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు.. డ్రగ్స్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని, ప్రతిరోజూ విచారణకు హాజరుకావాలని షరతులు విధించింది.

Arun Chilukuri
Published on: 28 April 2026 3:43 PM IST
Pilot Rohit Reddy
X

Pilot Rohit Reddy: పైలెట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు.. డ్రగ్స్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.

హైకోర్టు విధించిన షరతులు:

రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం పలు కఠిన నిబంధనలను విధించింది.

నిందితుడు తన పాస్‌పోర్టును వెంటనే పోలీసులకు అందజేయాలి.

ప్రతిరోజూ దర్యాప్తు అధికారి (IO) ఎదుట హాజరై సంతకం చేయాలి.

కేసు విచారణలో పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలి.

సాక్షులను బెదిరించడం లేదా విచారణను ప్రభావితం చేసే పనులు చేయకూడదు.

కేసు నేపథ్యం:

మార్చి 14న మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎస్‌వోటీ (SOT) పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్ తీసుకోవడంతో పాటు, తనిఖీలకు వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారనే తీవ్ర ఆరోపణలపై రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే పలుమార్లు వీరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. గతంలో ఉప్పర్‌పల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 8న వాదనలు పూర్తి కాగా, తాజాగా హైకోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story