పంజాగుట్ట పీఎస్‌లో హైడ్రామా: న్యాయవాదికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్.. ఆల్కహాల్ రీడింగ్‌తో కలకలం!

Punjagutta PS: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొంది.

Arun Chilukuri
Updated on: 13 April 2026 3:22 PM IST
Subba Rao Caught in Breath Analyzer Test
X

పంజాగుట్ట పీఎస్‌లో హైడ్రామా: న్యాయవాదికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్.. ఆల్కహాల్ రీడింగ్‌తో కలకలం!

Punjagutta PS: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గాయని మంగ్లీపై నమోదైన ఒక కేసు విషయమై బాధితులతో కలిసి వచ్చిన ప్రముఖ న్యాయవాది సుబ్బారావు తీరు గందరగోళానికి దారితీసింది.

అసలేం జరిగిందంటే?

న్యాయవాది సుబ్బారావు మీడియా ప్రతినిధులతో కలిసి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన నుంచి మద్యం వాసన వస్తుండటాన్ని గమనించిన పోలీసులు ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, సుబ్బారావుకు మధ్య వాగ్వాదం జరగడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితిని గమనించిన పంజాగుట్ట సీఐ (CI), వెంటనే న్యాయవాదికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసుల పరీక్షలో 27 శాతం ఆల్కహాల్ రీడింగ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. మద్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు రావడమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

మంగ్లీ కేసులో బాధితులకు న్యాయం చేసేందుకు వచ్చిన న్యాయవాదే మద్యం మత్తులో దొరికిపోవడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story