Kismatpur: పెళ్లయిన ప్రియురాలిని తెచ్చి.. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమైన కిలాడీ

Kismatpur: పెళ్లయిన యువతిని అత్తగారింటి నుండి తీసుకువెళ్లి, ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన సుశీల్ గౌడ్ అనే యువకుడి ఇంటి ముందు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ANJAIAH, SHAMSHABAD
Updated on: 3 April 2026 7:28 PM IST
Kismatpur
X

Kismatpur: పెళ్లయిన ప్రియురాలిని తెచ్చి.. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమైన కిలాడీ

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్ షా కోట్ ప్రాంతానికి చెందిన రవీందర్ యాదవ్ కూతురు ప్రియాంక యాదవ్ (25) ఎంబీఏ వరకు చదువుకుంది. గత సంవత్సరం మే 3వ తేదీన కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ యాదవ్ కు ప్రియాంక యాదవ్ ను ఇచ్చి ప్రియాంక తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించారు. వివాహం అనంతరం ప్రియాంక, ఆకాష్ దంపతులు కొన్ని రోజులపాటు సంతోషంగా గడిపారు. అనంతరం వారి వైవాహిక జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు.

ప్రియాంక ఇంటర్ చదువుతున్న రోజుల్లో సహ విద్యార్థి అయిన కిస్మత్పూర్ ప్రాంతానికి చెందిన సుశీల్ గౌడ్ అనే వ్యక్తి ప్రియాంకను ఇంటర్, డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రేమించానని తనతో వస్తే బాగా చూసుకుంటాను అంటూ వెంటపడ్డాడు. కానీ ప్రియాంక ససేమీరా అనడంతో సుశీల్ గౌడ్ ప్రియాంక భర్త అయిన ఆకాష్ కు మెసేజెస్ పెడుతూ బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఇంటర్ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ప్రియాంక నేను ప్రేమించుకున్నామని కలిసి తిరిగామని ప్రియాంక భర్త ఆకాష్ కు మెసేజ్లు పెట్టాడు.

ఈ నేపద్యంలో గత సంవత్సరం జులై 20వ తేదీన ప్రియాంకను కార్వాన్ లోని అత్తవారింటి నుండి సుశీల్ గౌడ్ తీసుకొని వెళ్ళిపోయాడు. దీంతో ఆకాష్ టపాచభూత్ర పోలీస్ స్టేషన్లో తన భార్య ప్రియాంక కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఆకాష్ ఫిర్యాదు మేరకు టప్పాఛభూత్ర పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రియాంకను అత్తవారింటి నుండి తీసుకొని వెళ్ళిన సుశీల్ గౌడ్ కొన్ని రోజుల తర్వాత ప్రియాంకతో కలిసి హైదరాబాద్ కు తిరిగివచ్చాడు. హైదరాబాద్ కు చేరుకున్న సుశీల్ గౌడ్ కు తనపై పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు అయిందని తెలుసుకుని ప్రియాంకతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు ‌. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకుని పంచాయతీ పెట్టారు.

ప్రియాంకకు అంతకుముందే మరో వ్యక్తితో పెళ్లి అయినందున వారి విడాకులు వచ్చిన తర్వాత ప్రియాంక సుశీల్ గౌడ్ పెళ్లి చేసుకుంటామంటూ పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రం రాసుకున్నారు అనంతరం సుశీల్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో వెళ్లిపోగా ప్రియాంకను పోలీసులు మహిళా సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కానీ ప్రియాంక అక్కడ ఉండలేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్టల్లో ఉంచారు.

ఇదిలా ఉండగా గత రాత్రి సుశీల్ గౌడ్ మరో అమ్మాయిని వివాహం చేసుకునేందుకు చేవెళ్ల లో ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న ప్రియాంక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారిని సముదాయించి పెళ్లి మండపం నుంచి పంపించివేశారు.

కాగా తమకు న్యాయం చేయాలంటూ ప్రియాంక కుటుంబ సభ్యులు, బంధువులు కిస్మత్ పూర్ లోని సుశీల్ గౌడ్ ఇంటి ముందర టెంట్ వేసుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సుశీల్ గౌడ్ ఇంటిలో ఎవరు లేనందువల్ల ఇరు కుటుంబాల వారు కూర్చుని ఒక అంగీకారానికి రావాలని సూచించడంతో ప్రియాంక కుటుంబ సభ్యులు అక్కడ నుండి వెళ్లిపోయారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story