Jammikunta: ఏప్రిల్ 25న జమ్మికుంటలో భారీ హిందూ సమ్మేళనం!

Jammikunta: జమ్మికుంట పట్టణంలో ఈనెల 25న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ పిలుపునిచ్చారు.

GANESH, JAMMIKUNTA
Published on: 19 April 2026 3:25 PM IST
Jammikunta
X

Jammikunta: ఏప్రిల్ 25న జమ్మికుంటలో భారీ హిందూ సమ్మేళనం!

Jammikunta: సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటే మనందరం సుఖ సంతోషంతో ప్రశాంతంగా ఉంటాం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (100) సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మన జమ్మికుంట పట్టణంలో హిందూ సమ్మేళనాన్ని ఈనెల 25 శనివారం రోజు సాయంత్రం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి (బొమ్మల గుడి) దేవస్థాన పరిధిలో నిర్వహించుటకు నిర్ణయం చేయడం జరిగింది.

అట్టి కార్యక్రమం కరపత్రం మరియు పోస్టర్ విడుదల కార్యక్రమం లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ధార్మికంగా ఎంతో ముందుందని ప్రజల్లో చైతన్యవంతం తేవాలంటే ఇలాంటి సమ్మేళనాల అవసరమని అప్పుడే సమాజం నీ మేలుకొలుపుని వాళ్ళం అవుతామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చందా రాజు, ఉత్సవ సమితి సభ్యులు పాకాల రవీందర్ రెడ్డి, రావికంటి నీలకంఠం, గందె రఘు, ఆకుల రాజయ్య, యముసాని సురేష్ , ఉమ్మడి చూరాచారి, కెవిడే కుమార్ స్వామి, భీమరి వెంకటేశ్వర్లు, బచ్చు భాస్కర్, జడల భాస్కరరావు, భూపతి రాజన్న, సోమారావు, తేల రాజమౌళి,

డింగరి రవికుమార్, ఆకుల రాజేందర్, యముసాని సమ్మయ్య ,టంగుటూరు రాజకుమార్, పొన్నగంటి. రవికుమార్, ఆవుల తిరుపతి, గట్టు సాయిరాం, సిరియాల విజయ్, మంచాల రాంబాబు, కంభంపాటి సతీష్, అయితే చంద్రమౌళి, ఆరెల్లి శ్రీనివాస్ ఉప్పుల శ్యామ్, దాసరి రవీందర్ మరియు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story