hmtv Health Conclave 2026: ఆరోగ్యమే మహాభాగ్యం.. వైద్య సేవలకు మహా సత్కారం.. hmtv హెల్త్ కాంక్లేవ్ 2026!
hmtv Health Conclave 2026: హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో నవంబర్ 28న సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో 'హెల్త్ కాంక్లేవ్ 2026 & అవార్డ్స్' జరగనుంది.
hmtv Health Conclave 2026: ఆరోగ్యమే మహాభాగ్యం.. వైద్య సేవలకు మహా సత్కారం.. hmtvహెల్త్ కాంక్లేవ్ 2026!
hmtv Health Conclave 2026: హెచ్‌ఎంటీవీ (hmtv) ఆధ్వర్యంలో ‘లైఫ్‌స్టైల్ అండ్ హెల్త్ కాన్ఫరెన్స్ - హెల్త్ కాంక్లేవ్ 2026 & అవార్డ్స్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 28 (శనివారం) సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఉన్న స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఈ సదస్సు జరగనుంది.
సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మరియు తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ పాల్గొననున్నారు.
సదస్సులో వివిధ ఆరోగ్య అంశాలపై సెషన్లు:
రోజువారీ జీవనశైలి, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు వివిధ రంగాల ప్రముఖ వైద్య నిపుణులతో ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు.
కార్డియోవాస్కులర్ హెల్త్ (మధ్యాహ్నం 2.00 - 3.00 గంటలకు): అపోలో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ. శ్రీనివాస్ కుమార్ మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు. ప్యానెలిస్ట్‌లుగా డాక్టర్ నవోదయ (కేర్ హాస్పిటల్), డాక్టర్ మహ్మద్ ఇస్మాయిల్ నిజామి (నిమ్స్), డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి కె (అపోలో) పాల్గొంటారు.
మెటబాలిక్ హెల్త్ (మధ్యాహ్నం 3.00 - 4.00 గంటలకు): కిమ్స్ హాస్పిటల్ సీనియర్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివ రాజు మోడరేటర్‌గా ఉంటారు. డాక్టర్ త్రివిక్రమ్, సుజాత స్టీఫెన్ (యశోద హాస్పిటల్), డాక్టర్ జె. తిరుపతి రావు (గాంధీ మెడికల్ కాలేజీ), డాక్టర్ హిమ బిందు (యశోద హాస్పిటల్) పాల్గొంటారు.
రీప్రొడక్టివ్ హెల్త్ (సాయంత్రం 4.00 - 5.00 గంటలకు): కిమ్స్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సి. వసుంధర మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు. ప్యానెల్‌లో డాక్టర్ అనిత కున్నయ్య (యశోద హాస్పిటల్), డాక్టర్ బి. లావణ్య (హారిజన్ ఉమెన్ & ఫెర్టిలిటీ సెంటర్), డాక్టర్ సూరజ్ పిన్ని (ఏఐఎన్యూ), డాక్టర్ కృష్ణ వేణి పాల్గొంటారు.
స్లీప్, స్ట్రెస్ & మెంటల్ హెల్త్ (సాయంత్రం 5.00 - 6.00 గంటలకు): కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ సి. వీరేందర్ మోడరేటర్‌గా ఉంటారు. డాక్టర్ రాధికా ఎన్. ఆచార్య, డాక్టర్ ఎం. ప్రత్యూష, డాక్టర్ కునాల్ వాఘ్రే (కిమ్స్-సన్‌షైన్) తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ సదస్సు ద్వారా ప్రజలకు ఆధునిక వైద్య విధానాలు, మానసిక, శారీరక ఆరోగ్య సంరక్షణపై సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు విశిష్ట సేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.




