HMTV Health Conclave: హైదరాబాద్ వేదికగా ఘనంగా ప్రారంభమైన 'హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ కాంక్లేవ్ & అవార్డ్స్ 2026'

HMTV Health Conclave: హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఘనంగా ప్రారంభమైన హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ కాంక్లేవ్.

Arun Chilukuri
Published on: 12 Sept 2026 4:04 PM IST
HMTV Health Conclave
X

HMTV Health Conclave: హైదరాబాద్ వేదికగా ఘనంగా ప్రారంభమైన 'హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ కాంక్లేవ్ & అవార్డ్స్ 2026'

HMTV Health Conclave: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వేదికగా వైద్య రంగంపై అత్యంత ప్రతిష్టాత్మకమైన 'హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ కాంక్లేవ్ & అవార్డ్స్ 2026' కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. హెచ్‌ఎమ్‌టీవీ మరియు ది హన్స్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహాసంగమం కొనసాగుతోంది. నగర ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ వైద్య సదస్సుకు విశేష స్పందన లభిస్తోంది.

ఈ కార్యక్రమం మధ్యాహ్నం 02:00 గంటల నుంచి సాయంత్రం 06:00 గంటల వరకు నాలుగు ప్రత్యేక సెషన్‌లుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నగర వాసుల కోసం ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని (Free Medical Camp) ఏర్పాటు చేశారు. పలువురు నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు, పరీక్షలు అందజేస్తున్నారు.

తొలి సెషన్‌లో ప్రముఖ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డా. జి.పి.వి. సుబ్బయ్య నేతృత్వంలో "కంప్లీట్ సైన్స్ కేర్" అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు.

మిగిలిన సెషన్లలో న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి వైద్య రంగానికి చెందిన పలు కీలక విభాగాలపై నిపుణులు చర్చించి, ప్రజలకు అవగాహన కల్పించారు.

వైద్య రంగంలో అంకితభావంతో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులు, ఆసుపత్రుల నిర్వహకులు మరియు నిపుణులను ఈ వేదికగా అభినందిస్తూ హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ ఎక్సెలెన్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, వైద్య విద్య, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే మెరుగైన వైద్య సేవలపై ఈ కాంక్లేవ్‌లో విస్తృతంగా చర్చించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.