Wanaparthy: ఘనంగా హిందూ సమ్మేళనం.. హిందూ జాగృతి దిశగా యువత అడుగులు
Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమం విజయవంతమైంది.
Wanaparthy: ఘనంగా హిందూ సమ్మేళనం.. హిందూ జాగృతి దిశగా యువత అడుగులు
Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఉదయం నిర్వహించిన బైక్ ర్యాలీతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు ఉత్సాహంగా కొనసాగింది.
సాయంత్రం నాలుగు గంటల నుంచి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనేశ్వరం పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ హాజరయ్యారు. స్థానిక సుభాష్ చౌరస్తా నుంచి భజంత్రీలతో హిందూ నామస్మరణ చేస్తూ భారీ ర్యాలీగా శ్రీ వాసవి మాత దేవాలయం వరకు ఆయనను తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన వక్తలు "హైందవి", "పత్తికొండ రాము" మాట్లాడుతూ భావితరాల్లో హిందూ జాగృతి కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు క్రమశిక్షణతో పాటు హిందూ మతంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ వంటి వీరులలా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.
ముఖ్య అతిథి కమలానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ, నేటి సమాజం శ్రీరాముడి జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రామాయణం ప్రతి ఒక్కరూ చదివి జీవన విలువలను తెలుసుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ, యువత కూడా ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి పెబ్బేరు ఉపఅఖండం పరిధి నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరయ్యారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమం అనంతరం శ్రీ వాసవి మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, హిందూ ధార్మికవేతలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




