Husnabad: ఆర్టీసీ కార్మికుల ధర్నా.. 22 నుండి బస్సులు బంద్?

Husnabad: రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు గేట్ ధర్నా నిర్వహించారు.

SRINIVAS, HUSNABAD
Published on: 18 April 2026 1:50 PM IST
Husnabad
X

Husnabad: ఆర్టీసీ కార్మికుల ధర్నా.. 22 నుండి బస్సులు బంద్?

Husnabad: రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు గేట్ ధర్నా చేపట్టారు. తమ 32 డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్మికులందరం సమ్మెలోకి వెళ్తున్నమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని,

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, యూనియన్లను పునరుద్ధరించాలనే ప్రధానమైన డిమాండ్లతో సమ్మెలో పాల్గొంటున్నామన్నారు. తమ శక్తిని ధారబోస్తూ మహాలక్ష్మి పథకాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని, తామేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD

Next Story