Huzurabad: డంపింగ్ యార్డ్ రద్దు చేయండి.. మంత్రి పొన్నంకు అఖిలపక్షం వినతి!
Huzurabad: హుజూరాబాద్ కాకతీయ కెనాల్ వద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అఖిలపక్షం వినతి పత్రం ఇచ్చింది.
Huzurabad: డంపింగ్ యార్డ్ రద్దు చేయండి.. మంత్రి పొన్నంకు అఖిలపక్షం వినతి!
కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కెనాల్ వద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం రద్దు కొరకు బి.సి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందించిన అఖిల పక్ష కమిటీ సభ్యులు.
సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ విషయమై ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మా దృష్టికి తీసుకువచ్చాడని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి త్వరలో సమస్యకు పరిష్కారం చూపెడుతామని అన్నారు.
మంత్రి సానుకూలంగా స్పందించడం సంతోషం..
డంపింగ్ యార్డ్ నిర్మాణం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, కరీంనగర్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా చూసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించడం చాలా సంతోషమని అఖిలపక్ష నాయకులు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజలకు సమస్యలు సృష్టించడం కాదు సమస్యలు తొలగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకంతో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.




