Huzurabad: విద్యార్థినుల సాహసయాత్ర.. జాతీయ స్థాయిలో విజయం
Huzurabad: శ్రీనగర్‌లో జరిగిన జాతీయ రగ్బీ పోటీల్లో హుజూరాబాద్ ఎంజేపి విద్యార్థినులు తృతీయ స్థానం సాధించారు.
Huzurabad: విద్యార్థినుల సాహసయాత్ర.. జాతీయ స్థాయిలో విజయం
Huzurabad: జాతీయ స్థాయి టచ్ రగ్బీ ఛాంపియన్‌షిప్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాల, హుజూరాబాద్‌కు చెందిన విద్యార్థినులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో నిర్వహించిన ఈ పోటీలలో తృతీయ స్థానం సాధించారు. ఈ విజయంతో పాఠశాలకే కాకుండా కరీంనగర్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.
ఆటగాళ్ల ప్రయాణానికి సంబంధించిన ట్రైన్ రిజర్వేషన్, ఇతర విషయాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పూర్తి సహాయ సహకరాలు అందించారు. బండి సంజయ్ సహకారం వల్లే తాము సౌకర్యవంతంగా పోటీలకు హాజరై విజయాన్ని సాధించగలిగామని ఆయా టీం విద్యార్ధినులు చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయా విద్యార్ధినులు తిరుగు ప్రయాణంలో న్యూఢిల్లీలో పర్యటించారు.
ఇండియా గేట్ వద్దకు వెళ్లి ‘‘థ్యాంక్యూ బండి సంజయ్ సార్’’ అంటూ ధన్యవాదాలు తెలపడం గమనార్హం. మరోవైపు రగ్బీ క్రీడల్లో జాతీయ స్థాయిలో కరీంనగర్ జిల్లాకు పేరు తీసుకొచ్చిన ఆయా విద్యార్ధినులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆయా విద్యార్ధినులకు సహాయ సహకారాలందించిన తెలంగాణ టచ్ రగ్బీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం. ప్రవీణ్, కరీంనగర్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు టీ చిరంజీవి చారి, కార్యదర్శి రంగు నిరంజనాచారి, సంయుక్త కార్యదర్శి, ఎం.జే.పీ బాలికల పి.ఇ.టి చిరుత కవిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే సాయి రాహుల్ ను అభినందించారు.




