Huzurabad: పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్న కాంగ్రెస్
Huzurabad: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశాలకు వొడితల ప్రణవ్ హాజరయ్యారు.
Huzurabad: పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్న కాంగ్రెస్
Huzurabad: ఏళ్ల కల నెరవేరుతున్న తరుణంలో లబ్ధిదారులు భావోద్వేగం. కరీంనగర్ జిల్లా.హుజూరాబాద్,జమ్మికుంట వీణవంక ఇల్లందకుంట,కమలాపూర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు.ఏప్రిల్ చివరి వారంలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు.
సొంతింటి కల అనేది ప్రతి పేదవాడి కల అని అలాంటి కలను కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్, వీణవంక మండలపరిధిలోనీ. వల్భాపూర్, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం, కొత్తపల్లి, ఇల్లంద కుంటమండల. పరిధిలోని. కనగర్తి, కమలాపూర్ మండల పరిధిలోని లక్ష్మీపూర్, గోపాల్ పూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశాలకు ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లబ్ధిదారులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.జీవితంలో ఇళ్లు కట్టు కుంటామా లేదా అని ఆందోళన చెందామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలోనే మాకు ఇళ్లు మంజూరు చేసిందని మా కలలకు జీవం పోసిన కాంగ్రెస్ పార్టీకి, ఇంచార్జి వొడితల ప్రణవ్ కు ప్రత్యేకంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన ప్రతి పేదవాడి ఇంటి నిర్మాణానికి ఆర్థికసహాయం అందిస్తున్నామని, ఏప్రిల్ చివరి మాసంలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారంచుడుతున్నామని దీని ద్వారా మరింత మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్చైర్పర్స, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుసభ్యులు, మండల, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




