ACB Raids: డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఏసీబీ పంజా.. కోట్లల్లో అక్రమాస్తులు!

ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు భారీ దాడులు నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 2 July 2026 10:47 AM IST
ACB Raids
X

ACB Raids: డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఏసీబీ పంజా.. కోట్లల్లో అక్రమాస్తులు!

ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ దాడులు చేసింది. డీజీపీ ఆఫీస్‌లో కంప్యూటర్‌ సర్వీసెస్‌లో డీఎస్పీగా పని చేస్తున్న భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఏసీబీ డీఎస్పీ మజీద్‌ అలీ ఆధ్వర్యంలో రైడ్స్‌ చేశారు. హైదరాబాద్‌లోని నివాసాలతో పాటు, 20 చోట్ల సోదాలు చేసింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. 8 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లలో డీఎస్పీ భీమ్‌రెడ్డి పని చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story