Hyderabad Cantonment: హైదరాబాద్ కంటోన్మెంట్‌లో కలకలం.. AK-47లు మాయం.!

Hyderabad Cantonment: హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ సెంటర్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పక్షికైనా

G Krishna
Published on: 1 Sept 2026 11:10 AM IST
Hyderabad Cantonment
X

Hyderabad Cantonment

Hyderabad Cantonment: హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ సెంటర్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పక్షికైనా ప్రాపర్ పర్మిషన్ లేనిదే లోపలికి ఎంట్రీ లేని అత్యంత హై-సెక్యూరిటీ జోన్‌లో ఏకంగా ఆయుధాల గది (ఆర్మరీ) తాళాలు పగలగొట్టి భారీగా వెపన్స్ దొంగిలించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సైన్యంలో ఎంతో ఘనచరిత్ర కలిగిన పదాతిదళ విభాగమైన మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లోనే ఈ రేంజ్ నేరం జరగడం ఆర్మీ ఉన్నతాధికారులకు బిగ్ షాక్ ఇచ్చింది.

చోరీ అయిన ఆయుధాలు, మందుగుండు ఇవే

ఆదివారం రాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఆర్మరీ డోర్ లాక్స్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యారు. అక్కడ ఉన్న ఆయుధాల నుంచి ఏకంగా 4 ఏకే-47 రైఫిళ్లు, 6 పవర్‌ఫుల్ పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు ఒక భారీ వెపన్‌తో సహా మొత్తం 12 కీలకమైన ఆయుధాలను దొంగిలించారు. వీటితో పాటు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి (అమ్మ్యునిషన్) ని కూడా పట్టుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. సోమవారం ఉదయం రొటీన్ చెకింగ్ సమయంలో ఈ చోరీ విషయం బయటపడటంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో అఫీషియల్‌గా కంప్లైంట్ ఫైల్ చేశారు.

మద్రాస్ రెజిమెంట్ హిస్టరీ అండ్ సెక్యూరిటీ సిస్టమ్

భారతీయ సైన్యంలో అత్యంత పురాతనమైన, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ప్రతిష్టాత్మక విభాగం ఈ మద్రాస్ రెజిమెంట్. "స్వధర్మే నిధనం శ్రేయ" అనే పవర్‌ఫుల్ మోటోతో ఇక్కడ సోల్జర్స్‌కు కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు. అలాంటి చోట మల్టీ-లేయర్డ్ సెక్యూరిటీ నెట్‌వర్క్ ఉంటుంది. మెయిన్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర కఠినమైన సెక్యూరిటీ చెక్స్, నిరంతరం ఆర్మీ పెట్రోలింగ్, సిసిటివి నిఘా కళ్ల మధ్య ఈ డెరింగ్ రాబరీ జరగడం , తెల్లారే వరకు ఎవరికీ అనుమానం రాకపోవడం అతిపెద్ద మిస్టరీగా మారింది.

ఇన్‌సైడర్ హ్యాండ్ ఉందా? పోలీసుల ఆంగిల్ ఇదే

రక్షణ రంగానికి చెందిన సున్నితమైన మేటర్ కావడంతో పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే బయటి వ్యక్తులు కంటోన్మెంట్ లోపలికి వచ్చి, ఆర్మరీ లొకేషన్ ఐడెంటిఫై చేసి, అంత భారీ ఆయుధాలను తీసుకెళ్లడం దాదాపు ఇంపాజిబుల్ అని క్రైమ్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్మరీ సెక్షన్‌లో పనిచేసే సిబ్బందిలో ఎవరికైనా ఇందులో ప్రమేయం ఉందా అనే కోణంలో మెయిన్‌గా డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. పైగా ఇన్ని వెపన్స్ ఒక్కరు మాత్రమే మోయడం సాధ్యం కాదు కాబట్టి, కచ్చితంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గ్యాంగ్‌గా ఏర్పడి ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

సీసీటివి ఫుటేజ్ పరిశీలన.. ముమ్మరంగా ఇన్వెస్టిగేషన్

కేసు నమోదు చేసుకున్న బొల్లారం పోలీసులు , ఆర్మీ ఉన్నతాధికారులు స్పాట్‌కు చేరుకుని సీసీటివి ఫుటేజ్‌లను క్షుణ్ణంగా స్కాన్ చేస్తున్నారు. లోపలికి వచ్చిన వాహనాలు, ఆ టైమ్‌లో డ్యూటీలో ఉన్న గార్డ్స్, ఆర్మీ సిబ్బంది వివరాలను కలెక్ట్ చేసి తీవ్రంగా విచారిస్తున్నారు. దొంగిలించబడిన ఆయుధాలు రాంగ్ హాండ్స్‌లోకి వెళ్తే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది, కాబట్టి ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని వీలైనంత త్వరగా రికవరీ చేయడానికి స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story