CP Sajjanar: అందమైన అమ్మాయిల యాడ్స్ చూసి మోసపోకండి.. ‘హనీట్రాప్’పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

CP Sajjanar: యువత ఒంటరి తనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.

Arun Chilukuri
Published on: 17 March 2026 2:43 PM IST
CP Sajjanar
X

CP Sajjanar: అందమైన అమ్మాయిల యాడ్స్ చూసి మోసపోకండి.. ‘హనీట్రాప్’పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

CP Sajjanar: యువత ఒంటరి తనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఒంటరిగా ఉంటే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి, అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనక నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చుదాగుందన్నారు.

ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని...అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలని తెలిపారు. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయని తెలిపారు. మీరు ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడొద్దని...సైబర్ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండని...సీపీ సజ్జనార్ అప్రమత్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story