Hyderabad: మద్యం మత్తులో గొడవ.. బండరాయితో కొట్టి స్నేహితుడి హత్య!
Hyderabad Crime News: నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది.
Hyderabad: మద్యం మత్తులో గొడవ.. బండరాయితో కొట్టి స్నేహితుడి హత్య!
Hyderabad Crime News: నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం చివరకు ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే:
సనత్ నగర్ ప్రాంతంలోని పైప్ లైన్ రోడ్డు వద్ద నివాసం ఉంటూ భిక్షాటన చేసుకునే నరేష్ (45), రోహిత్ (35) మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. నిన్న రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
బండరాయితో తలపై బాది..
కోపోద్రిక్తుడైన రోహిత్, రోడ్డు పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తీసుకుని నరేష్ తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నరేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న సనత్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు రోహిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? లేక కేవలం మద్యం మత్తులో జరిగిన గొడవే హత్యకు దారి తీసిందా? అనే కోణంలో విచారణ సాగుతోంది.




