CP Sajjanar: ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!
CP Sajjanar: ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు, కేక్ కటింగ్స్‌ను నిషేధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
CP Sajjanar: ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!
CP Sajjanar: హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ట్యాంక్‌బండ్‌పై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో నగర పోలీసులు అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రోడ్లు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. నగర యువత, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
క్షణికానందం, సరదాల కోసం అర్ధరాత్రి వేళల్లో రోడ్లపైకి వచ్చి ప్రాణాలను రిస్క్‌లో పడేసుకోవద్దని యువతకు హితవు పలికారు. రెండ్రోజుల క్రితం ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి తన పుట్టినరోజు రోజే మృతి చెందగా, ఆమెను కాపాడబోయిన కుటుంబ సభ్యుడు కూడా దుర్మరణం చెందడం తీవ్ర కలచివేసిందని పేర్కొన్నారు.
ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టారు. పుట్టినరోజు వేడుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై కాకుండా, ఇళ్ల వద్ద లేదా సురక్షిత ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని సూచించారు.
పోలీసుల నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి వేళ రోడ్లపై అల్లర్లు లేదా వేడుకలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.




