HYDRAA: శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
HYDRAA: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హైడ్రా (HYDRAA) మరోసారి ఉక్కుపాదం మోపింది. ఎయిర్‌పోర్ట్ కాలనీలో రూ.కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది.
HYDRAA: శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
HYDRAA: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఓఆర్‌ఆర్ పక్కనే ఉన్న సర్వే నెంబర్ 626/1లోని 5 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టు కంప్లయింట్లు వచ్చాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. తమ సిబ్బందితో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా.. ఎయిర్‌పోర్ట్ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు.
Next Story




